ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    దళారులకు అడ్డాగా మారిన మక్కల కొనుగోలు కేంద్రం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు7 ఏప్రిల్, 202610:37 AM
    దళారులకు అడ్డాగా మారిన మక్కల కొనుగోలు కేంద్రం
    స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 7: స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్‌కు తీసుకొచ్చినా కొనుగోలు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. అధికారులు దళారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించిన రైతులు, తమ మక్కలను ఎందుకు కొనడం లేదని ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు పెడతామంటూ భయపెడుతున్నారని తెలిపారు.
    దళారులకు అడ్డాగా మారిన మక్కల కొనుగోలు కేంద్రం  - అదనపు చిత్రం 1
    ఈ పరిస్థితిని తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని పూర్తి మద్దతు ప్రకటించారు. వెంటనే మక్కల కొనుగోళ్లు ప్రారంభించాలని మార్కెట్ అధికారులను డిమాండ్ చేశారు. లేదంటే నియోజకవర్గ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండలం పార్టీ ఇంచార్జ్ కేసిరెడ్డి రాకేష్ రెడ్డి, మండల కన్వీనర్ రంగు హరీష్, 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్, 5వ వార్డు కౌన్సిలర్ రమ్య రఘు రెడ్డి, మండల నాయకులు జనగం యాదగిరి, కొండాపూర్ మాజీ సర్పంచ్ రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్, సంకెళ్ళ రవి, పెది బాబు, బంగారు అయ్యలు, తోట వేణు, వేయి శ్రీను, నీల కుమార్, బోనగిరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
    దళారులకు అడ్డాగా మారిన మక్కల కొనుగోలు కేంద్రం  - అదనపు చిత్రం 3
    దళారులకు అడ్డాగా మారిన మక్కల కొనుగోలు కేంద్రం  - అదనపు చిత్రం 4
    మీ స్పందన:

    షేర్ చేయండి: