ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    చర్లపల్లి స్టేషన్‌లో అగ్నికీలలు.. దగ్ధమైన రైలు బోగీలు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు16 నవంబర్, 202602:03 PM

    చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఓ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్టేషన్‌ పరిసరాల్లో కలకలం రేగింది.

    చర్లపల్లి స్టేషన్‌లో అగ్నికీలలు.. దగ్ధమైన రైలు బోగీలు
    హైదరాబాద్‌ నవంబర్16 ప్రజాధ్వని : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఓ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్టేషన్‌ పరిసరాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది? రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: