ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    జనగామ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా గడ్డమీది సురేష్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 ఆగస్టు, 202601:58 PM
    జనగామ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా గడ్డమీది సురేష్
    జనగామ , ఆగస్టు 8 ప్రజాధ్వని : చిల్పూర్‌ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్‌ జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఉమ్మడి వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లకావత్‌ ధనవంతి చేతుల మీదుగా సురేష్‌ నియామక పత్రాన్ని స్వీకరించారు.
    జనగామ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా గడ్డమీది సురేష్ - అదనపు చిత్రం 1
    అనంతరం పార్టీ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని గడ్డమీది సురేష్‌ తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఎంపీ కడియం కావ్య, జిల్లా అధ్యక్షురాలు ధనవంతి, పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: