ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    జిల్లా వార్తలు

    ఎమ్మెల్యే నాయిని సమక్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 జూన్, 202603:01 PM
    ఎమ్మెల్యే నాయిని సమక్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు
    హనుమకొండ, జూన్ 5 ప్రజాధ్వని : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి యువత నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 400 మంది యువకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువ నాయకులు అక్కినపెల్లి అరవింద్, మాడిశెట్టి సుశీల్, తిరునహరి చిన్న బంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత సమస్యల పరిష్కారానికి విష్ణువర్ధన్ రెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, నాయకులు తోట పవన్, కనిగంటి శేఖర్, కుమార్ యాదవ్, సైండ్ల శ్రీకాంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: