మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును పరామర్శించిన బీజేపీ నాయకులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు23 మే, 202607:20 AM

హనుమకొండ, మే 23 (ప్రజాధ్వని):
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును బీజేపీ నాయకులు పరామర్శించారు. శస్త్రచికిత్స అనంతరం హనుమకొండ రాంనగర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ధర్మారావును బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ యాదవ్, ఇనుగాల దామోదర్ రెడ్డి, గంటె శివకుమార్ యాదవ్‌లు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
