జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా శాగంటి మణి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు15 ఆగస్టు, 202611:16 AM

జనగామ ఆగష్టు 15 ప్రజాధ్వని : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఇటీవల నియమితులైన శాగంటి మణికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చేతుల మీదుగా శాగంటి మణి నియామక పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాగంటి మణి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానన్నారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజాసేవకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించడంలో కీలకపాత్ర పోషించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతికి శాగంటి మణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
