రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కేసులో...
- బిఆర్ఎస్ నాయకులకు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్...
- అక్రమ అరెస్టులను ఖండించిన బిఆర్ఎస్ నాయకులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు9 సెప్టెంబర్, 202601:17 PM

స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 09 ప్రజాధ్వని: బిఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ లోకి రానివ్వకుండా,మహిళ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి నిరసనగా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం పై ,రేవంత్ రెడ్డి పై నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన కేసులో పోలీసులు కేసిరెడ్డి రాకేష్ రెడ్డి, జనగం యాదగిరి, మోటం రాజు, ఎడ్ల మహిపాల్, బూర్ల రాజేశ్వర్, నారగోని రాజు, ఎడ్ల రాజేష్, లింగారెడ్డి లపై కేసు నమోదు చేసి, స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రజాస్వామ్యం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా నాయకుడు ఇల్లందుల సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ కేసులకు భయపడదని, కేసులకు భయపడేది ఉంటే ఆనాడు రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయే వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టుల వెనుక ఎవరున్నారో ప్రజలకు అందరికీ తెలుసని, కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి, దిష్టిబొమ్మలు దహనం చేస్తే వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నల్ల టీ షర్టులు ధరించి నిరసన తెలిపితే తప్పులేదు కానీ, అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు ధరిస్తే తప్పా అని రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని, దానిని కాలరాసే అధికారం కాంగ్రెస్ నాయకులకు ఎవరు ఇచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొన్న రాజేష్, బలగాని అనిల్ గౌడ్, బూర్ల విష్ణు, శీలం శ్యామ్, రంగు హరీష్, ఓగ్గు రాజు, బూర్ల విష్ణు, పెద్ది రాజబాబు, రాహుల్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
