ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    విద్యార్థులు అభిరుచికి అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకోవాలి

    • పదో తరగతి తర్వాత కోర్సులు, ఉపాధి అవకాశాలపై సైకాలజిస్ట్ పల్లె నాగేశ్వరరావు అవగాహన
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు13 నవంబర్, 202602:08 PM

    వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

    విద్యార్థులు అభిరుచికి అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకోవాలి
    రాయపర్తి, నవంబర్ 13 (ప్రజాధ్వని): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్ పల్లె నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పల్లె నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పదో తరగతి అనంతరం విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, ఉపాధి అవకాశాలపై వివరించారు. ఇతరుల ఒత్తిడికి లోనుకాకుండా తమ అభిరుచి, ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. చదివిన పాఠ్యాంశాలను సులభంగా గుర్తుంచుకోవడం, పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, ఏకాగ్రత పెంపొందించుకోవడంపై పలు మెమరీ టిప్స్‌ అందించారు. ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటల చొప్పున 120 రోజుల పాటు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత మాట్లాడుతూ.. పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిపుణులు అందించిన సూచనలను విద్యార్థులు ఆచరణలో పెట్టి, ఇప్పటి నుంచే తమ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వి.వి.ఆర్. ఆచార్య, ఉపాధ్యాయులు కేసోజు సత్యనారాయణ, కటకం రఘు, శ్యాంసుందర్, నాగరాజు, అనితారాణి, అమర స్వర్ణ, శివకృష్ణ, రాజు, రమ, వీరస్వామి, నరేష్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: