ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    బాధిత కుటుంబానికి అండగా బీఆర్‌ఎస్ నాయకుడు జబ్బర్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు23 జూన్, 202603:42 PM
    బాధిత కుటుంబానికి అండగా బీఆర్‌ఎస్ నాయకుడు జబ్బర్
    స్టేషన్‌ ఘనపూర్, జూన్‌ 23 ప్రజాధ్వని : ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన చింత వరుణ్‌ తేజ్ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ 18వ వార్డు ఇన్‌చార్జ్ ఎండీ జబ్బర్ మంగళవారం పరామర్శించారు. మృతుడి తండ్రి చింత రమేష్ నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న జబ్బర్ తనవంతు సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల సహాయాలు కుటుంబానికి అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కష్టసమయంలో ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా మానవత్వంతో స్పందిస్తామని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఎండీ జబ్బర్ వార్డు ప్రజలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యండి జబ్బర్ కురిషి , యండి జహంగీర్, యండి ఖాదీర్, యండి హఫీజ్, యండి అజీజ్ తదితరులు పాల్గొన్నారు
    మీ స్పందన:

    షేర్ చేయండి: