ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    చిన్నారి ఆరోహిని ఆశీర్వదించిన ఇమ్మానియేల్ రాజ్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు13 ఏప్రిల్, 202605:20 AM
    చిన్నారి ఆరోహిని ఆశీర్వదించిన ఇమ్మానియేల్ రాజ్
    జఫర్గడ్, ఏప్రిల్‌ 13 ప్రజాధ్వని : జఫర్గడ్ మండలం (ఐ)తమ్మడిపల్లి గ్రామంలో నిర్వహించిన చిన్నారి ఆరోహి తొలి పుట్టినరోజు వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. ఈ వేడుకలకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సింగపురం ఇందిరా కుమారుడు, యువ నాయకుడు సింగపురం ఇమ్మానియేల్ రాజ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాడపాక రాజ్‌కుమార్, దివ్య దంపతుల కుమార్తె ఆరోహి జన్మదిన వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు చిన్నారికి ఆశీస్సులు అందజేసి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మానియేల్ రాజ్ సన్మానించారు.
    చిన్నారి ఆరోహిని ఆశీర్వదించిన ఇమ్మానియేల్ రాజ్ - అదనపు చిత్రం 1
    ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి మౌనిక, జనగాం జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ సింగపురం నాగయ్య, మాజీ ఉపసర్పంచ్ సింగపురం వెంకటయ్య, సింగపురం కిరణ్ కుమార్, సింగపురం సందీప్, మండల నాయకులు మక్తర్ అలీ, రమేష్, మాజీ జెడ్పిటిసి సదయ్య, తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ హరిబాబు, వార్డు సభ్యులు రడపాక రెహమాన్, రడపాక రవి, ఎడ్ల యాదమ్మ, మునిగల మంజుల, వెంకటాపురం మాజీ ఉపసర్పంచ్ మాదాసు భాస్కర్ జ్యోతి, సీనియర్ నాయకులు సింగపురం రత్నం, ఐలయ్య, కనకయ్య, దేవయ్య, తాటికొండ సంపత్, చిల్పూర్ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చాగంటి మని, బీసీ సెల్ అధ్యక్షుడు బాలరాజు, నారగోని సరిత గౌడ్, యువజన నాయకులు కార్తీక్, సునీల్, చింటూ, దిలీప్, సందీప్‌తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: