ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మాజీ మంత్రి అరెస్ట్ (స్టేషన్)లో ఉద్రిక్తత

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు24 ఏప్రిల్, 202609:40 AM
    మాజీ మంత్రి అరెస్ట్ (స్టేషన్)లో ఉద్రిక్తత
    జనగామ జిల్లా, స్టేషన్ ఘనాపూర్ ప్రజాధ్వని : బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలకు హాజరుకావడానికి నర్సంపేటలోని ముత్తోజుపేటకు వెళ్తుండగా, చిన్న పెండ్యాల సమీపంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
    మాజీ మంత్రి అరెస్ట్ (స్టేషన్)లో ఉద్రిక్తత - అదనపు చిత్రం 1
    అనంతరం శ్రీనివాస్ గౌడ్‌ను స్టేషన్ ఘనాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్ విషయం తెలుసుకున్న స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసుల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అరెస్ట్‌ను ఖండించారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేషన్ ముందు బైఠాయించిన వారిలో కౌన్సిలర్లు అనిల్, రాజేష్, రాజేశ్వర్, మధు నాయకులు మాచర్ల గణేష్, కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, మారపల్లి ప్రసాద్,రంగు హరీష్, తోట సురేందర్, సురేష్ కుమార్, చిట్టిబాబు, గుండే మల్లేష్, చల్లా చందర్ రెడ్డి, మునిగల రాజు, బూర్ల విష్ణు, పెద్ది రాజాబాబు, పింగిలి రాహుల్, సంపత్ తో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    మాజీ మంత్రి అరెస్ట్ (స్టేషన్)లో ఉద్రిక్తత - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: