ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    బాధిత కుటుంబానికి కౌన్సిలర్ మధు భరోసా

    • రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్యామ్ కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు15 అక్టోబర్, 202602:00 AM

    స్టేషన్‌ ఘన్‌పూర్‌, అక్టోబర్ 15 (ప్రజాధ్వని): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నీరటి శ్యామ్‌ కుటుంబాన్ని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్‌ తాటికొండ మధు పరామర్శించారు.

    బాధిత కుటుంబానికి కౌన్సిలర్ మధు భరోసా
    స్టేషన్‌ ఘన్‌పూర్‌, అక్టోబర్ 15 (ప్రజాధ్వని): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నీరటి శ్యామ్‌ కుటుంబాన్ని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్‌ తాటికొండ మధు పరామర్శించారు. శ్యామ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. మానవతా దృక్పథంతో తన వంతు సాయంగా 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ శ్యామ్‌ మృతి బాధాకరమని, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన కౌన్సిలర్‌కు కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: