ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    సెంట్రల్‌ లాక్‌తో కారులో బాలుడు.. యూట్యూబ్‌ వీడియోతో బయటకు!

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు28 సెప్టెంబర్, 202602:19 PM
    సెంట్రల్‌ లాక్‌తో కారులో బాలుడు.. యూట్యూబ్‌ వీడియోతో బయటకు!
    స్టేషన్‌ఘన్‌పూర్‌, సెప్టెంబరు 28 (ప్రజాధ్వని): కారులో చిక్కుకున్న ఓ బాలుడిని బయటకు తీసేందుకు తండ్రి, స్థానికులు సుమారు 20 నిమిషాల పాటు చేసిన ప్రయత్నాలు ఉత్కంఠకు దారితీశాయి. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ కేంద్రంలోని శివునిపల్లిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శివునిపల్లిలోని ఓ హోటల్‌ వద్ద ఓ వ్యక్తి తన కుమారుడిని కారులో కూర్చోబెట్టి టిఫిన్‌ తీసుకురావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో కారు సెంట్రల్‌ లాక్‌ పడిపోవడంతో డోర్లు తెరుచుకోలేదు. దీంతో బాలుడు కారులోనే చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి స్థానికుల సహాయంతో కారును తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ప్రయత్నించిన అనంతరం ఓ వ్యక్తి యూట్యూబ్‌లోని వీడియోను చూపిస్తూ బాలుడికి సూచనలు చేశాడు. బాలుడు ఆ సూచనలను పాటిస్తూ కారు అద్దాన్ని కిందకు దించడంతో చివరకు డోర్‌ తెరిచి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: