ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    చిల్పూరు గుట్టలో భక్తిరసం… 580 మెట్లకు కొబ్బరికాయలతో సంకల్పం పూర్తి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు14 ఏప్రిల్, 202603:22 PM
    చిల్పూరు గుట్టలో భక్తిరసం… 580 మెట్లకు కొబ్బరికాయలతో సంకల్పం పూర్తి
    చిల్పూరు, ఏప్రిల్ 14 (ప్రజాధ్వని): చిల్పూరు శ్రీ బుగుల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన 580 మెట్లు భక్తిరసంతో నిండిపోయాయి. మెట్ల నిర్మాణం పూర్తికావడంతో దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
    చిల్పూరు గుట్టలో భక్తిరసం… 580 మెట్లకు కొబ్బరికాయలతో సంకల్పం పూర్తి - అదనపు చిత్రం 1
    ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు ముందుగా చేసిన సంకల్పాన్ని నెరవేర్చుతూ ప్రతి మెట్టుకు ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనేక గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పండితుల ఆశీర్వచనాల మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గత 40 ఏళ్లుగా వివిధ కారణాలతో మెట్ల నిర్మాణం జరగకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తెలిపారు. ట్రస్ట్ బోర్డుకు రెండోసారి అవకాశం లభించడంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు. 580 మెట్లు అందుబాటులోకి రావడంతో భక్తులకు ఆలయానికి చేరుకోవడం సులభమైందని ఆయన అన్నారు. ఈ పనులకు సహకరించిన ఎమ్మెల్యే, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు.
    చిల్పూరు గుట్టలో భక్తిరసం… 580 మెట్లకు కొబ్బరికాయలతో సంకల్పం పూర్తి - అదనపు చిత్రం 2
    భవిష్యత్తులో దేవస్థాన అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రాకార మండపం, రిటైనింగ్ వాల్, కాటేజీలు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
    చిల్పూరు గుట్టలో భక్తిరసం… 580 మెట్లకు కొబ్బరికాయలతో సంకల్పం పూర్తి - అదనపు చిత్రం 4
    మీ స్పందన:

    షేర్ చేయండి: