ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    చిల్పూర్‌లో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు14 ఆగస్టు, 202604:39 PM
    చిల్పూర్‌లో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర
    చిల్పూర్‌, ఆగస్టు 14 ప్రజాధ్వని : దేశ ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత భావాలను పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు చిల్పూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలను చేతబూని ఈ యాత్ర చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్‌ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగింది. విద్యార్థులు, బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు.
    చిల్పూర్‌లో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర - అదనపు చిత్రం 1
    ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు పెండ్యాల దిలీప్‌కుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్‌, దళిత మోర్చా అధ్యక్షుడు కందుకూరి రజినీకార్‌, సోషల్‌ మీడియా కో-కన్వీనర్‌ ముక్కెర రమేష్‌ యాదవ్‌, మండల నాయకులు దామెర ప్రశాంత్‌, బోసు నాయక్‌, శైలేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: