బతుకమ్మ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 అక్టోబర్, 202602:38 PM

వర్ధన్నపేట, అక్టోబర్ 6, ప్రజాధ్వని: బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఆర్కాసాయికుంట వద్ద బతుకమ్మ నిర్వహణకు ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారి తదితర సదుపాయాలను పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. స్థలాన్ని ప్రజలకు, మహిళలకు ఉపయోగకరంగా ఉండేలా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొనే పండుగకు అనువైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో 56వ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, మహిళా అధ్యక్షురాలు అనిత, సీనియర్ నాయకులు మర్రి ప్రభాకర్, చింత రమేష్, సంధ్య, డివిజన్ ముఖ్య నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
