ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    పల్లగుట్టకు చేరుకోనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • భారీ సభకు సర్వం సిద్ధం..
    • ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు9 జూన్, 202604:42 AM
    పల్లగుట్టకు చేరుకోనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
    చిల్పూర్, జూన్ 9 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పల్లగుట్ట గ్రామంలో నిర్వహించనున్న విద్యుత్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మరికొద్ది క్షణాల్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో సభా వేదిక, ప్రజల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్, భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులు కలిసి పరిశీలించారు. రూ.60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన 7 విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సభా వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దగా, వేలాది మంది ప్రజలు పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: