ఉప్పుగల్‌లో ఐకేపీ కేంద్రం ప్రారంభం
- రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి: సర్పంచ్ సాంబరాజు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు11 అక్టోబర్, 202602:37 AM

జాఫర్‌గఢ్, అక్టోబరు 10 ప్రజాధ్వని: రైతులకు అందుబాటులో ఉండేలా ఉప్పుగల్ గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కొడారి సాంబరాజు ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ధాన్యం విక్రయించే రైతులకు అవసరమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు, కేంద్ర నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాట మధు, గ్రామ వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొరి శ్రీధర్, పోరెడ్డి సత్యనారాయణరెడ్డి, న్యాయం జైపాల్‌రెడ్డి, సీసీ శోభ, వీవోసీఏ పూజారి శ్రీవాణి, సొంటిరెడ్డి విజయ, నల్ల పెద్దిరెడ్డి, వడ్లకొండ రంజిత్, హమాలీలు, గ్రామ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
