బతుకమ్మ వేడుకలకు మహిళలకు డీజే బాక్స్ అందజేత
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు3 అక్టోబర్, 202601:58 AM

రాయపర్తి, అక్టోబర్ 2 (ప్రజాధ్వని): బతుకమ్మ పండుగ సందర్భంగా రాయపర్తి మండలం కొండూరు గ్రామ మహిళలకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.23 వేల విలువైన డీజే బాక్స్‌ను పంపిణీ చేశారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన ఎనబోతుల దేవేందర్, అకుతోట సుధాకర్ మహిళల కోసం డీజే బాక్స్ కావాలని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించిన శ్రీనివాస్‌రెడ్డి వెంటనే డీజే బాక్స్‌ను సమకూర్చి శుక్రవారం రాత్రి మహిళలకు అందజేశారు. బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు తన వంతు సహకారం అందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్‌ఎస్ నాయకులు, కొండూరు గ్రామ సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, గ్రామస్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
