జిల్లా ఉత్తమ సర్పంచ్ తిరుపతమ్మకు ఎమ్మార్పీఎస్ సన్మానం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు8 సెప్టెంబర్, 202612:11 PM

చిల్పూర్ సెప్టెంబర్ 08 ప్రజాధ్వని : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ సర్పంచ్‌గా ప్రశంసాపత్రం అందుకున్న చిన్నపెండ్యాల గ్రామ సర్పంచ్ ఇల్లందుల తిరుపతమ్మను ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 246 గ్రామ పంచాయతీలు ఉండగా వివిధ వర్గాలకు చెందిన సర్పంచ్‌లు ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన చిన్నపెండ్యాల గ్రామ సర్పంచ్ ఇల్లందుల తిరుపతమ్మ జిల్లా ఉత్తమ సర్పంచ్‌గా ఎంపిక కావడం ఆమె కృషికి దక్కిన గుర్తింపేనని అన్నారు. తిరుపతమ్మ సాధించిన ఈ గౌరవం రాష్ట్రంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమెకు రాష్ట్రస్థాయిలోనూ మరింత గొప్ప గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి గాదే శ్రీధర్ మాదిగ, జిల్లా నాయకులు సంజన రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుర్రం నవీన్ మాదిగ, చిల్పూర్ మండల ఇన్‌చార్జి చాడ ఏలియా మాదిగ, జిల్లా నాయకులు మంద శ్రీనివాస్, ఆరూరి శ్రీనివాస్ మాదిగ, మండల నాయకులు జిల్లెపల్లి స్వామి మాదిగ, మేడ స్వామి, కలకుల రాజశేఖర్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
