ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    బీసీలంతా ఏకమై హక్కులు సాధించుకోవాలి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు1 అక్టోబర్, 202609:15 AM
    బీసీలంతా ఏకమై హక్కులు సాధించుకోవాలి
    రాయపర్తి, అక్టోబర్ 1 ప్రజాధ్వని: బీసీల హక్కుల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని బీసీ హక్కుల సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రెండో మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బీసీ భవిష్యత్తు, బీసీల ఐక్యత, బీసీ శక్తిని చాటేలా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాలని నాయకులు కోరారు. బీసీలంతా తమ ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకుని చట్టసభల్లో తమ వాటాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ‘బీసీల ఐక్యత వర్ధిల్లాలి’ అనే నినాదంతో మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 16న వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో బీసీ హక్కుల సాధన సమితి రెండో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి నాయకత్వంలో జరిగే ఈ మహాసభకు బీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాయపర్తి మండల అధ్యక్షుడు రావుల అనిల్, గౌరవ అధ్యక్షుడు గజవెల్లి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మచ్చ కుమారస్వామి, బొట్ల శ్రీనివాస్, మండల కోశాధికారి పాము మనోహర్, గ్రామ నాయకులు మచ్చ రమేష్, మారోజు వెంకటేశ్వర్లు, ఎనగందుల యాదగిరి, దేశబోయిన ఉపేందర్, పులి ఓంకార్, పుల్ల శ్రీను, గుంటుక నాగరాజు, ఎనగందుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: