మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ మృతికి ఇమ్మాన్యుయేల్ రాజ్ నివాళి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు5 నవంబర్, 202601:21 PM
మండల మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ (మణికంఠ) మృతి పట్ల స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర కుమారుడు సింగపురం ఇమ్మాన్యుయేల్ రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

రఘునాథపల్లి నవంబర్ 5 ప్రజాధ్వని : మండల మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ (మణికంఠ) మృతి పట్ల స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర కుమారుడు సింగపురం ఇమ్మాన్యుయేల్ రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అజయ్ మృతివార్త తెలుసుకున్న ఆయన స్వగృహానికి వెళ్లి భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ రాజ్ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో బొల్లం అజయ్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, అజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి మౌనిక, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కీసర దిలీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల మహేందర్, కార్యదర్శి శాగంటి మణి, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సింగపురం నాగయ్య, రఘునాథపల్లి మండల మాజీ అధ్యక్షుడు మంద రమేష్, మైనారిటీ నాయకుడు రషీద్, యువజన నాయకులు నీలం యువరాజు, సింగపురం ప్రతీష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
