ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    జిల్లా వార్తలు

    పీజీ 3, 4వ సెమిస్టర్ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు6 ఆగస్టు, 202603:30 PM
    పీజీ 3, 4వ సెమిస్టర్ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్
    హనుమకొండ, ఆగస్టు 6 (ప్రజాధ్వని): కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పీజీ రెండో సంవత్సరం విద్యార్థుల 3వ, 4వ సెమిస్టర్ ఫలితాలను తక్షణమే విడుదల చేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ, బీఈడ్, సీపీగెట్ ప్రవేశాలు, కౌన్సెలింగ్ ప్రక్రియలు కొనసాగుతున్న నేపథ్యంలో పీజీ విద్యార్థులకు మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అత్యవసరంగా అవసరమవుతున్నాయని తెలిపారు. అయితే 3వ, 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య ప్రవేశాలు, కౌన్సెలింగ్‌లు, ఉద్యోగ నియామకాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
    పీజీ 3, 4వ సెమిస్టర్ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ - అదనపు చిత్రం 1
    వినతి పత్రం అందిస్తున్న హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్
    రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న 3వ, 4వ సెమిస్టర్ ఫలితాలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని రిజిస్ట్రార్‌ను కోరినట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలను అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి శివకుమార్, వంశీ, పీజీ విద్యార్థులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: