ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మహిళా సమాఖ్య భవనంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం: సీపీఐ

    • శిలాఫలకం వద్ద పార్టీ నేతల నిరసన
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు3 సెప్టెంబర్, 202606:43 AM
    మహిళా సమాఖ్య భవనంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం: సీపీఐ
    జాఫర్‌గడ్, సెప్టెంబర్ 3 ప్రజాధ్వని: మండల కేంద్రంలో స్వర్ణభారతి మహిళా సమాఖ్య భవనం నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ మండల కమిటీ నాయకులు ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.32 లక్షలతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి సుమారు పదేళ్ల క్రితం శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం పూర్తి కాకపోవడంపై బుధవారం శిలాఫలకం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మండల కార్యదర్శి జువ్వారి రమేష్ మాట్లాడుతూ మండలంలోని స్వర్ణభారతి మహిళా సమాఖ్య రూ.1.93 కోట్లతో 935 గ్రామీణ సంఘాలు, 9,815 మంది సభ్యులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ సొంత భవనం లేక అద్దె భవనంలో కొనసాగడం దురదృష్టకరమన్నారు. గత పాలకులు శంకుస్థాపనలు చేసి పనులను గాలికి వదిలేశారని విమర్శించారు. అప్పటి కాంట్రాక్టర్ పిల్లర్ల వరకు మాత్రమే పనులు చేపట్టి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారని తెలిపారు. ఇంతకాలం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేసిన అప్పటి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో మహిళలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా, మండల కార్యవర్గ సభ్యులు వడ్లకొండ సుధాకర్, వేల్పుల పెద్దరాములు, మంద బుచ్చయ్య, ఎండీ జాఫర్, కలకోటి యాదగిరి, ముసలయ్య, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: