ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    రాయపర్తిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

    • సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్న మహిళలు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202604:08 PM
    రాయపర్తిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
    రాయపర్తి, అక్టోబర్ 10 ప్రజాధ్వని: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బతుకమ్మ సందడి ప్రారంభమైంది. ఇందులో భాగంగా శనివారం మహిళలు సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ వేడుకల్లో ఆకుల అరుంధతి దేవి, ఏ. నర్మద, సీహెచ్. సునీత, రావుల మాధవి దేవి, పాశం తనుశ్రీ,మమత, నవ్య, చందన, సంధ్యారాణి, స్వీటీ తదితరులు పాల్గొన్నారు.
    రాయపర్తిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: