ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    పల్లగుట్ట గ్రామంలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 ఏప్రిల్, 202608:09 AM
    పల్లగుట్ట గ్రామంలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులు
    చిల్పూర్, ఏప్రిల్ 22 (ప్రజాధ్వని): జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. బుధవారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లగుట్ట గ్రామం నియోజకవర్గంలో ప్రధాన గ్రామంగా ఉండి నాలుగు గ్రామాలకు జంక్షన్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. తాను 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు తెలిపారు. గ్రామానికి నాలుగు వైపులా రహదారులు నిర్మించడంతో పాటు ప్రధాన మార్గాలను పూర్తి చేసినట్లు గుర్తుచేశారు.
    పల్లగుట్ట గ్రామంలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులు - అదనపు చిత్రం 1
    ఇటీవలి కాలంలో గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేసి 30 ఇళ్ల నిర్మాణం చేపట్టామని, జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. సీసీ రోడ్లకు రూ.1.30 కోట్లు, హెల్త్ సబ్‌సెంటర్‌కు రూ.25 లక్షలు, కమ్యూనిటీ హాల్‌కు రూ.20 లక్షలు, మహిళా సంఘాలకు రూ.10 లక్షలు, వెటర్నరీ ఆస్పత్రికి రూ.5 లక్షలు కేటాయించినట్లు వివరించారు. ఇప్పటివరకు గ్రామంలో రూ.3 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, అదనంగా సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.3.25 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడుతూ గత ప్రభుత్వ అప్పుల భారాన్ని ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం సరఫరా, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. వితంతు పెన్షన్లను పెంచినట్లు, ఇందిరా కుటుంబం పథకం కింద కుటుంబ సభ్యుడు మరణిస్తే 15 రోజుల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, సర్పంచ్ ఎనగందుల నరసింహ రెడ్డి, ఉపసర్పంచ్ ఎండీ రఫీ, అధికారులు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు
    పల్లగుట్ట గ్రామంలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులు - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: