జాతీయ రహదారి పక్కనే చెత్త కుప్పలు...
- అధికారుల నిర్లక్ష్యం,,ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు23 సెప్టెంబర్, 202605:40 AM

రాయపర్తి, సెప్టెంబర్ 22 ప్రజాధ్వని:వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై రాయపర్తి వద్ద ఇరువైపులా అపరిశుభ్రంగా మారింది, ప్లాస్టిక్ కవర్లు, వస్త్ర వర్ధాలు, ఇతర చెత్తను రహదారి పక్కనే పడేస్తుండడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది, ప్రధాన రహదారి వెంబడి ఈ పరిస్థితి నెలకొన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వెంటనే చెత్తను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని వారి కోరుతున్నారు,
