ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    మానవత్వం చాటుకున్న బాల్యమిత్రులు.. మహేందర్ కుటుంబానికి రూ.81 వేల సాయం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు21 అక్టోబర్, 202604:02 PM

    ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి 1999–2000 పదో తరగతి బాల్యమిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మైస మహేందర్ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

    మానవత్వం చాటుకున్న బాల్యమిత్రులు.. మహేందర్ కుటుంబానికి రూ.81 వేల సాయం
    రాయపర్తి, అక్టోబర్ 21 (ప్రజాధ్వని): ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి 1999–2000 పదో తరగతి బాల్యమిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మైస మహేందర్ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మహేందర్ అకాల మరణవార్త తెలుసుకున్న ఆయన పదో తరగతి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్నేహితుడి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫోన్ కాల్స్ ద్వారా పరస్పరం సంప్రదించుకుని విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మహేందర్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు రూ.81 వేల నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. కేవలం సానుభూతి ప్రకటించడానికే పరిమితం కాకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించినట్లు బాల్యమిత్రులు తెలిపారు. భవిష్యత్తులోనూ మహేందర్ కుటుంబానికి ఎలాంటి ఆపద ఎదురైనా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాల్యమిత్రుల ఔదార్యంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు అనిల్ కుమార్, సతీష్ కుమార్, గోలి మహేందర్ రెడ్డి, సోమేశ్వర్, రవి ప్రసాద్, రాము, రవి తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: