స్టేషన్ ఘనపూర్ లో ఘనంగా నిర్మలమాత దేవాలయ వార్షికోత్సవం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు31 మే, 202605:46 PM

స్టేషన్‌ఘన్‌పూర్, మే 31 (ప్రజాధ్వని): స్టేషన్‌ఘన్‌పూర్‌లోని నిర్మలమాత దేవాలయం (కాథలిక్ చర్చ్) వార్షికోత్సవ వేడుకలు మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు, జపమాల, దివ్యబలి పూజలు నిర్వహించగా, చర్చ్ ఫాదర్ అగస్టిన్ రెడ్డి వివిధ ఆధ్యాత్మిక అంశాలపై వాక్య పరిచర్య చేశారు. మొదటి రోజు నిర్మలమాత పతాకావిష్కరణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రెండో రోజు నిర్మలమాత విగ్రహాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై ఊరేగింపుగా పట్టణ వీధుల్లో తీసుకెళ్లారు. బ్యాండ్‌మేళం నడుమ సాగిన ఈ ప్రదర్శనలో భక్తులు కొవ్వొత్తులు పట్టుకుని భక్తిగీతాలు ఆలపిస్తూ పాల్గొన్నారు. మూడో రోజు నిర్వహించిన దివ్యబలి పూజను కరుణాపురంలోని సెయింట్ సేవియర్ సెమినార్‌కు చెందిన రెవ. ఫాదర్ ప్రవీణ్ సమర్పించారు. అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు, బైబిల్ ఆధారిత నాటికలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తరువాత జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా మాజీ డిప్యూటీ సీఎం డా రాజయ్య,స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్ పండుగలో పాల్గొన్నారు. భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ అగస్టిన్ రెడ్డి, ఇతర ఫాదర్లు, సంఘ పెద్దలు, కాథలిక్ విశ్వాసులు పాల్గొన్నారు.
