ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    శివరామపురంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 సెప్టెంబర్, 202604:17 AM
    శివరామపురంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
    రాయపర్తి, సెప్టెంబర్‌ 17 (ప్రజాధ్వని): వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం శివరామపురం గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ శీల హేమలత–రత్నాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడంతో పాటు శానిటైజేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పారిశుధ్య ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మొయినుద్దీన్‌, ఉపసర్పంచ్‌ భూక్య లక్ష్మణ్‌, వార్డు సభ్యులు లత, యాకయ్య, అనిత, రవి, కాయితోజు ఉపేంద్రచారి, రావు రాజిరెడ్డి, పసునూరి ప్రభాకర్‌రెడ్డి, నాగపురి యాకయ్య, పెందోట వెంకటేశ్వర్లు, భూక్య వీరన్న, కడియం యాకయ్య, కుక్కల సంపత్‌, సిరిమల్లె వెంకటాద్రి, కారోబార్‌ కుసుమ మహత్మ, పెగడ యాకయ్య, నాగపురి శ్రీనివాస్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చెడుపాక శ్రీలత, ఆశా వర్కర్‌ జయమ్మతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: