ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    నర్సంపేటకు వెళ్తుండగా శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు24 ఏప్రిల్, 202608:21 AM
    నర్సంపేటకు వెళ్తుండగా శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్
    స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 24 ప్రజాధ్వని : నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా డ్రైవర్ శంకర్ గౌడ్ కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నర్సంపేటకు వెళ్తున్న సమయంలో తనను అదుపులోకి తీసుకుని స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టడం తగిన విధానం కాదని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొత్త విషయం కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలకు ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వకపోతే, కార్మికులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: