ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    తెలంగాణ విమోచన పోరాట చరిత్రను యువతకు తెలియజేయాలి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు17 సెప్టెంబర్, 202602:14 PM
    తెలంగాణ విమోచన పోరాట చరిత్రను యువతకు తెలియజేయాలి
    చిల్పూర్, సెప్టెంబర్ 17 (ప్రజాధ్వని): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంటె ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం చారిత్రాత్మకమైనదని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి, ముఖ్యంగా యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు పెండ్యాల దిలీప్‌కుమార్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరటి రాజు ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: