ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    చలో అసెంబ్లీకి బయలుదేరిన బీజేపీ నేతల అరెస్ట్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు7 సెప్టెంబర్, 202612:47 PM
    చలో అసెంబ్లీకి బయలుదేరిన బీజేపీ నేతల అరెస్ట్
    చిల్పూర్, సెప్టెంబరు 7 ప్రజాధ్వని : విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు మేరకు, జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడా రమేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిల్పూర్ మండలం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్ధమైన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు వారి ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టుల్లో భాగంగా బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ కాదుగాయ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని బీజేపీ నాయకులు విమర్శించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: