స్టేషన్ ఘన్‌పూర్ డంపింగ్ యార్డ్ కు మహర్దశ!
- కడియం శ్రీహరి చొరవతో రూ.1.50 కోట్లతో మూడు షెడ్ల నిర్మాణం
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో అదనంగా మరో 3 ఎకరాల భూమి కేటాయింపు
- అదనంగా మరో 3 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 నవంబర్, 202601:53 AM
స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ అభివృద్ధిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరో కీలక ముందడుగు వేశారు. పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు, చెత్త సమస్యకు మెరుగైన నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి దిశగా డంపింగ్ యార్డ్ అభివృద్ధికి ప్రత్యేక…

స్టేషన్ ఘన్‌పూర్, నవంబర్ 3 (ప్రజాధ్వని ): స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ అభివృద్ధిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరో కీలక ముందడుగు వేశారు. పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు, చెత్త సమస్యకు మెరుగైన నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి దిశగా డంపింగ్ యార్డ్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారు.ఆయన కృషితో రూ.1.50 కోట్ల పట్టణ అభివృద్ధి నిధులతో మూడు షెడ్ల నిర్మాణానికి మార్గం సుగమం కాగా, ఇప్పటికే ఉన్న డంపింగ్ యార్డ్ కు అదనంగా మరో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు కూడా సాధ్యమైంది. డంపింగ్ యార్డ్ లో ఒక కంపోస్ట్ షెడ్, ఒక డీఆర్సీసీ షెడ్, ఒక స్టోర్ రూమ్ నిర్మించనున్నారు. ఒక్కో షెడ్ సుమారు 90 అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవుతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే వ్యర్థాల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు మెరుగుపడటంతో పాటు పట్టణ పరిశుభ్రత నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుంది.గతంలో డంపింగ్ యార్డ్ కు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉండేది. అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో జిల్లా కలెక్టర్ తో చర్చించి సర్వే నంబర్ 504లో అదనంగా మరో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. దీంతో డంపింగ్ యార్డ్ కు మొత్తం ఐదు ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. నిధుల సమీకరణతో పాటు అదనపు భూమి కేటాయింపుపైనా దృష్టి సారించడం ద్వారా పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే కడియంకు కృతజ్ఞతలు- తాటికొండ వినయ్ కుమార్, మున్సిపాలిటీ చైర్మన్
పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూ.1.50 కోట్ల నిధులతో డంపింగ్ యార్డ్ లో మూడు షెడ్ల నిర్మాణం చేపట్టడం సంతోషకరం. అదనంగా మరో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడం వల్ల పట్టణ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.
-అంబటి కిషన్ రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు
పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు డంపింగ్ యార్డ్ అభివృద్ధి కీలకం. అదనంగా మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం వల్ల చెత్త నిర్వహణకు మరింత వెసులుబాటు కలుగుతుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
- బూర్ల శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు
చెత్త నిర్వహణకు శాశ్వత వసతులు కల్పించే దిశగా డంపింగ్ యార్డ్ అభివృద్ధి చేపట్టడం అభినందనీయం. రూ.1.50 కోట్ల నిధులతో మూడు షెడ్ల నిర్మాణం, అదనంగా మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, కలెక్టర్ కు కృతజ్ఞతలు.
