ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    స్టేషన్ ఘనపూర్‌లో విద్యుత్ కార్మికుల ధర్నా – డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు30 మార్చి, 202608:11 AM
    స్టేషన్ ఘనపూర్‌లో విద్యుత్ కార్మికుల ధర్నా – డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన
    స్టేషన్ ఘనపూర్ డివిజన్ కార్యాలయం ముందు విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిసన్ కార్మికులు, ఆన్ మ్యాన్డ్ సిబ్బందిని, పీస్ రేట్ వర్కర్లు, పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు రాజు, లక్ష్మణ్ మాట్లాడుతూ, తాము న్యాయమైన డిమాండ్లను మాత్రమే కోరుతున్నామని తెలిపారు. ఆర్టిసన్ కార్మికులను వారి విద్యార్హతల ప్రకారం కన్వర్షన్ చేయాలని, ఆన్ మ్యాన్డ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, పీస్ రేట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు. 26వ తేదీన, అలాగే 30వ తేదీన విన్నవించినా యాజమాన్యం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆన్ మ్యాన్డ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు కూడా వెళ్తామని హెచ్చరించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: