నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్
- శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని వినతి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు7 సెప్టెంబర్, 202602:25 PM

స్టేషన్‌ఘన్‌పూర్ సెప్టెంబర్ 07 ప్రజాధ్వని : స్టేషన్‌ఘన్‌పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐని వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో సీఐని కలిసిన ఆయన శాలువా కప్పి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా గంజాయి, పేకాటతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నూతన సీఐ స్పందిస్తూ.. ప్రజల సహకారంతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో శాంతిభద్రతలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్నా ప్రజలు నేరుగా తనను సంప్రదించవచ్చని సీఐ పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ది రాజబాబు, రాహుల్ పటేల్, శ్రీను, వేణు, రమణ, నాగరాజు, రాకేష్ ,అజయ్, శివ, ప్రశాంత్, ప్రకాష్, అజయ్, వెంకట్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
