ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు... ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు24 జులై, 202601:07 PM
    ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు... ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
    స్టేషన్ ఘనపూర్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాటికొండ మధు, పొన్న రాజేష్, బలగాని అనిల్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, పార్శి రంగన్న, ఆకుల కుమార్, గుర్రం ఏసుబాబు, సోషల్ మీడియా కన్వీనర్ గట్టు కృష్ణసాయి, పెద్ది రాజబాబు, రాహుల్ పటేల్, తోట వేణు, వేయి శ్రీను, బూర్ల విష్ణు, తోట రాజు, ఒగ్గు రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు... ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: