ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    కాంగ్రెస్‌ పార్టీలో పాత కార్యకర్తలకు గుర్తింపు ఏదీ?

    • పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన
    • పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆరోపణలు.. పాత కార్యకర్తలను గుర్తించాలని డిమాండ్
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు16 ఆగస్టు, 202603:38 AM
    కాంగ్రెస్‌ పార్టీలో పాత కార్యకర్తలకు గుర్తింపు ఏదీ?
    చిల్పూర్ ఆగష్టు 15 ప్రజాధ్వని : కాంగ్రెస్‌ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవులు దక్కడం లేదని చిల్పూర్‌ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీతో సంబంధం లేని వారికి సైతం పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. వెంకటేశ్వరపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టమేకల శివరాజు యాదవ్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జెండా మోసి, ఎన్నికల్లో రోడ్డెక్కి ప్రచారం చేసిన కార్యకర్తలను ప్రస్తుతం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలే పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేశారని వారు పేర్కొన్నారు. అలాంటి వారిని పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. “పదవులు రాకపోయినా పర్వాలేదు.. కనీసం గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. కష్టకాలంలో పార్టీ కోసం నిలిచిన కార్యకర్తలను విస్మరిస్తే వారిలో నిరాశ పెరుగుతుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు వెంటనే జోక్యం చేసుకుని పాత, నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించాలని వారు కోరారు. పదవుల విషయంలో పార్టీ కోసం పనిచేసిన వారిని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: