ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    లక్ష్మమ్మ మృతదేహానికి అభిమాన్ గాంధీ నాయక్ నివాళులు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు21 అక్టోబర్, 202603:43 PM

    దేవరుప్పుల మండల మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొల్లూరి సోమయ్య మాతృమూర్తి కొల్లూరి లక్ష్మమ్మ మృతికి టీఎస్‌జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ సంతాపం వ్యక్తం చేశారు.

    లక్ష్మమ్మ మృతదేహానికి అభిమాన్ గాంధీ నాయక్ నివాళులు
    రాయపర్తి, అక్టోబర్ 21 (ప్రజాధ్వని): దేవరుప్పుల మండల మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొల్లూరి సోమయ్య మాతృమూర్తి కొల్లూరి లక్ష్మమ్మ మృతికి టీఎస్‌జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మమ్మ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం మృతి చెందారన్న విషయం తెలుసుకున్న ఆయన చౌడూరు గ్రామంలోని సోమయ్య నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. తల్లిని కోల్పోయిన సోమయ్యను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల బీఆర్ఎస్ నాయకులు, గ్రామ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: