ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    స్టేషన్ ఘనపూర్ లో 20 అడుగుల భారీ గణనాథుడు

    • రూ.85 వేలతో ప్రత్యేక ఆకర్షణ...భక్తులను ఆకట్టుకుంటున్న గణపయ్య
    • జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
    • కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో "ఇరుముడి"సినిమా ప్రదర్శన
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు20 సెప్టెంబర్, 202604:18 PM
    స్టేషన్ ఘనపూర్ లో 20 అడుగుల భారీ గణనాథుడు
    స్టేషన్ ఘనపూర్ 20 సెప్టెంబర్ ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. పట్టణంలోని 4వ వార్డులో జై హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. సుమారు రూ.85 వేల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ భారీ గణపతి విగ్రహానికి ప్రత్యేక లైటింగ్, పూల అలంకరణతో మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
    స్టేషన్ ఘనపూర్ లో 20 అడుగుల భారీ గణనాథుడు - అదనపు చిత్రం 1
    ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు వినోదంతో పాటు భక్తిని పంచేందుకు ఇరుముడి సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.8 వేల రూపాయల ఖర్చుతో మొబైల్ LED వ్యాన్ ద్వారా భారీ స్క్రీన్ పై సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శనను వీక్షించేందుకు చిన్నారులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తి, వినోదం కలయికతో ఈ మండపం స్టేషన్ ఘనపూర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: