ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్‌ నేతల అవగాహన

    • నష్కల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు25 అక్టోబర్, 202608:15 AM

    స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి ఎంపీ కడియం కావ్య సూచనల మేరకు, చిల్పూర్‌ గుట్ట దేవస్థానం చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆదేశాలతో చిల్పూర్‌ మండలంలోని నష్కల్‌ గ్రామంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం…

    పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్‌ నేతల అవగాహన
    చిల్పూర్‌, అక్టోబరు 24 (ప్రజాధ్వని): స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి ఎంపీ కడియం కావ్య సూచనల మేరకు, చిల్పూర్‌ గుట్ట దేవస్థానం చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆదేశాలతో చిల్పూర్‌ మండలంలోని నష్కల్‌ గ్రామంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిల్పూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమీది సురేష్‌ మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు ఎంతో కీలకమని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు మల్లారెడ్డి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇసురం కృష్ణ, నష్కల్‌ సర్పంచ్‌ శాతబోయిన రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు పాశం ప్రకాష్‌, సీనియర్‌ నాయకులు భాస్కర్‌రెడ్డి, యమునాకర్‌రెడ్డి, పాశం సురేష్‌, దేవస్థాన చైర్మన్‌ కొరుకుప్పల కిషన్‌, మోడెం స్వామి, మోడెం బిక్షపతి, పాశం రాజు, వార్డు సభ్యుడు మహేందర్‌, గ్రామ ఉపాధ్యక్షుడు కోతి రాజు, రఘు, అనిల్‌, ప్రభాకర్‌, అశోక్‌, నకరికంటి యాదగిరి, డిశి రాజు, పాశం రవి, పాశం ప్రభుదాస్‌, నంగునూరు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
    పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్‌ నేతల అవగాహన - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: