ఘనంగా కాంగ్రెస్ నేత సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు12 నవంబర్, 202610:44 AM
కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్లోని ఆమె క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

స్టేషన్ ఘన్పూర్ నవంబర్ 12 ప్రజాధ్వని: కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్లోని ఆమె క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు సింగపురం ఇందిరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె కేక్ కట్ చేయగా, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నాయకులు, కార్యకర్తల సందడితో క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ సింగపురం నాగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల మహేందర్, జిల్లా కార్యదర్శి శాగంటి మణి, తాటికొండ సంపత్, చిల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కల్లకోలు బాలరాజు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కొమురయ్య, ఎస్సీ సెల్ కన్వీనర్ కోర్నెల్, కార్యదర్శి పులి శ్రావణ్, గుర్రపు యాదగిరి, మహిళా అధ్యక్షురాలు జోత్స్న, నారగోని పద్మతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
