ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: గంటె ఉపేందర్ పిలుపు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 ఏప్రిల్, 202603:13 PM
    బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: గంటె ఉపేందర్ పిలుపు
    చిల్పూర్ ఏప్రిల్ 05 ప్రజాధ్వని: చిల్పూర్ మండలంలోని అన్ని బూత్‌లలో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6న ఘనంగా నిర్వహించాలని చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ పిలుపునిచ్చారు. ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇళ్లపై పార్టీ జెండాను తప్పనిసరిగా ఎగరవేయాలని సూచించారు. ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు
    మీ స్పందన:

    షేర్ చేయండి: