ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    కొండూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు

    • దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. భారీ బతుకమ్మతో యువత ఆకర్షణ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 అక్టోబర్, 202604:53 PM

    వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామ యూత్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

    కొండూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
    రాయపర్తి, అక్టోబర్ 18 (ప్రజాధ్వని): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామ యూత్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామ యువత ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. యూత్ సంఘాల నేతృత్వంలో గ్రామంలో భారీ బతుకమ్మను పేర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. బతుకమ్మను అందంగా అలంకరించడంతో గ్రామస్తులు, యువత ఆకర్షితులయ్యారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉత్సవాలను నిర్వహిస్తూ గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: