బాధిత కుటుంబానికి విఘ్నేశ్వర యూత్ సేవా సంఘం ఆర్థిక సాయం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు1 అక్టోబర్, 202609:28 AM

రాయపర్తి, అక్టోబర్ 1 ప్రజా ధ్వని: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన వల్లాల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న విఘ్నేశ్వర యూత్ సేవా సంఘం సభ్యులు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబానికి తమ వంతు సహకారం అందించడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో విఘ్నేశ్వర యూత్ సేవా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
