రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పల్లగుట్ట విద్యార్థులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు11 సెప్టెంబర్, 202602:54 PM

చిల్పూర్ సెప్టెంబర్ 11 ప్రజాధ్వని : చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై గ్రామానికి, మండలానికి పేరు తీసుకురానున్నారు. పల్లగుట్ట గ్రామానికి చెందిన బండి గౌతమ్, 5వ తరగతి, అలాగే నంద వరుణ్ తేజ్, 9వ తరగతి, రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఫర్ బాయ్స్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రాణించాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు. పల్లగుట్ట వంటి గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
