ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    తాటికొండ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

    • ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు9 అక్టోబర్, 202604:06 PM
    తాటికొండ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
    స్టేషన్‌ ఘన్‌పూర్‌ అక్టోబర్ 09 ప్రజాధ్వని: మండలంలోని తాటికొండ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ కోలాటాలు ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు. విద్యార్థినుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
    తాటికొండ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 1
    ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ప్రకృతితో మహిళలకు ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    తాటికొండ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: