ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    భారీ వర్షానికి కూలిన ఇల్లు.. నిరాశ్రయులైన పేద కుటుంబం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు24 సెప్టెంబర్, 202612:03 PM
    భారీ వర్షానికి కూలిన ఇల్లు.. నిరాశ్రయులైన పేద కుటుంబం
    రాయపర్తి, సెప్టెంబర్‌ 24 (ప్రజాధ్వని): భారీ వర్షాలకు రాయపర్తి మండలంలోని సన్నూరు గ్రామంలో ఓ పేద కుటుంబానికి చెందిన ఇల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన దడిగేల నర్సమ్మకు చెందిన ఇల్లు బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిని కూలిపోయింది. దీంతో నర్సమ్మ కుటుంబం నిరాశ్రయంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇల్లు కూలిన సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. అయితే ఇంటి నిర్మాణం పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబానికి తలదాచుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబానికి ఇల్లు కూలిపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. ఇల్లు కూలిపోయిన ఘటనపై అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు, బాధిత కుటుంబానికి తాత్కాలిక వసతి, అవసరమైన నిత్యావసర వస్తువులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: