ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిల్పూర్‌లో జెండా ఆవిష్కరణ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు6 ఏప్రిల్, 202610:18 AM
    బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిల్పూర్‌లో జెండా ఆవిష్కరణ
    చిల్పూర్, ఏప్రిల్ 6 ప్రజాధ్వని : జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి దిశగా భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి వర్గానికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామ స్థాయి వరకు పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే మండలంలోని నష్కల్, వంగాలపల్లి, పల్లగుట్ట, కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, దేశాయ్ తండా గ్రామాల్లో కూడా స్థానిక నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాల్నే శ్రీనివాస్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ కాదుగాయ రమేష్, జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కందుకూరు రజినీకాంత్, పింజర రంజిత్, అనిల్ నాయక్.
    మీ స్పందన:

    షేర్ చేయండి: