తిడుగులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు16 ఆగస్టు, 202603:48 AM

జఫర్ఘడ్ ఆగష్టు 15 ప్రజాధ్వని : జఫర్ఘడ్ మండలం తిడుగు గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మాదరాపు విజయ్‌కుమార్ (స్వేరో) అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలను పూలతో అలంకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోపు సోమయ్య, ఉప సర్పంచ్ కాలకోటి మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాన పుస్తకాలను అందజేశారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తూ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

